Friday, September 16, 2011

అడవిపై హక్కు ముమ్మాటికి ఆదివాసిలదే హక్కు

ఉరి శిక్ష ఇప్పటికే దాదాపు 90 దేశాలలో రద్దు చేసారు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన మన భారత దేశంలో ఇంకా ఈ ఉరిశిక్షని అమలుపరచడం ప్రజాస్వామ్యానికే కళంకం.జల్,
జంగల్, జమీన్ కోసం పోరాడుతున్న ఆదివాసి బిడ్డలను వేరే ఇతర కేసులు పెట్టి ఆదివాసి హక్కులను కాలరాస్తూ వారికి ఇలా ఉరిశిక్ష వేయడం చాలా హేయమైన చర్య, ప్రజాస్వామ్య వాదులుగా మేము దీనిని ఖండిచాలీ,
ముంబై దాడులలో అనేక మందిని పొట్టన పెట్టుకున్న కసాబ్ లాంటి టెర్రరిస్తులకు లేని ఉరిశిక్ష ఆదివాసి హక్కుల కోసం పోరాడుతున్న వీరిపై ఎందుకింత తొందర??
అడవిపై హక్కు ముమ్మాటికి ఆదివాసిలదే హక్కు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ప్రజలని తన పాటలతో చైతన్య పరుస్తున్న జీతాన్ మారండి లాంటి వాళ్ళను అక్రమ కేసులను బనాయించి ఉరి తీయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఉరి తీయడమే, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉరి శిక్ష ని రద్దు చేసి అమాయకులు అయిన ఆదివాసి బిడ్డలని విడుదల చేయాలి.

No comments:

Post a Comment